- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : అక్రమ కట్టడాలు కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులో ఉన్న పుల్లాయి కుంట రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నదని, ఆఖరికి తూముని కుడా వదల లేదు

దిశ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులో ఉన్న పుల్లాయి కుంట రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నదని, ఆఖరికి తూముని కుడా వదల లేదు అనే వరుస కథనలతో దిశ పత్రిక వాస్తవలను ప్రజలకి, అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. అలాగే మున్సిపల్ అధికారులు కబ్జా చేసిన తూములో రూము ని నిర్మిస్తే అట్టి రూముకి తిమ్మాపూర్ హవేలి శివారు హౌస్ నెంబర్ ఇచ్చారు. అధికారులు చేసిన తప్పుడు హౌస్ నెంబర్లు కేటాయించిన డాటాను రికార్డ్ల తో సహా దిశ పత్రిక ప్రచురించింది.
రికార్డులను పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ సర్వేచేసి, స్థానిక విచారణ చేపట్టి పుల్లయి కుంట తూము కబ్జా అయింది వాస్తవమే అని నిర్ధారించుకుని వెను వెంటనే కబ్జా చేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చి, అక్రమంగా తూము పై నిర్మించిన కట్టడమును కూల్చివేసి పుల్లాయి కుంట తూమును మరమ్మత్తులు చేసి మరల తూమును ఉపయోగంలోకి తీసుకొచ్చారు. దీనివలన కుంట చుట్టుపక్కల లోతట్టు ప్రాంతంలో ఉన్న 250 గుడిసెలు నీట మునగకుండా చర్యలు తీసుకున్నారు. తూము మరమ్మతుల కారణంగా కుంట నిండిన వెంటనే నీరు తూము ద్వారా ఉర్సు చెరువులోకి పోయే విధంగా అధికారులు మరమ్మతులు చేశారు.
హర్షం వ్యక్తం చేసిన లెనిన్ నగర్ కాలనీ వాసులు
గత కొంతకాలంగా పుల్లాయికుంట తూము ఆక్రమణకు గురైందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు, దిశ పత్రిక వాళ్లు పుల్లాయకుంట తూము పై అక్రమ కట్టడాల రికార్డులను సాక్షాలతో సహా దిశపత్రికలో ప్రచురించారు, రికార్డును పరిశీలించిన అధికారులు వెనువెంటనే అక్రమ కట్టలను కూల్చివేసి తూమును మరమ్మత్తు చేశారు. లెనిన్ నగర్ కాలనీ అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సాక్షాలతో సహా దిశ పత్రికలో ప్రచురించిన యాజమాన్యానికి మా లెనిన్ నగర్ కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.






