బస్సు సౌకర్యం కల్పించండి..

by Elthuri vijay kumar |

రోడ్డుపై బైఠాయించిన మాదన్నపేట గ్రామస్తులు

బస్సు సౌకర్యం కల్పించండి..
X

బస్సు సౌకర్యం కల్పించండి..

- రోడ్డుపై బైఠాయించిన మాదన్నపేట గ్రామస్తులు

- డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమణ

దిశ, కమలాపూర్: గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామం నుండి హనుమకొండ, పరకాల, మండల కేంద్రానికి ఎటు ప్రయాణించాలన్న బస్సు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో మాదన్నపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు. అంబాల గ్రామం మీదుగా హనుమకొండ - పరకాల వైపుగా వెళ్లే రహదారి వైపు రాకపోకలు అంతరాయం కలుగగా మాదన్నపేట గ్రామం మీదుగా వెళుతున్న బస్సులను అడ్డగించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీసులు డిపో మేనేజర్ లతో మాట్లాడి వారం రోజుల వ్యవధిలో బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింప చేశారు.గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని గ్రామస్తులు హెచ్చరించారు.

Next Story