ఆన్ లైన్ సేవల నుండి ఏఎన్ఎంలను తొలగించాలంటూ నిరసన

by Elthuri vijay kumar |

వైద్యాధికారికి వినతి పత్రం అందజేత

ఆన్ లైన్ సేవల నుండి ఏఎన్ఎంలను తొలగించాలంటూ నిరసన
X

ఆన్ లైన్ సేవల నుండి ఏఎన్ఎంలను తొలగించాలంటూ నిరసన

- వైద్యాధికారికి వినతి పత్రం అందజేత

దిశ, మంగపేట : నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ఆన్ లైన్ సేవల నుండి ఏఎన్ఎంలను తొలగించాలంటూ మంగపేట, చుంచుపల్లి, బ్రాహ్మణపల్లి ఆసుపత్రులకు చెందిన ఏఎన్ఎంలు సోమవారం మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు వై.జమునా రాణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్(ఎన్సీడీ) కార్యక్రమాల్లో ఏఎన్ఎంలతో స్క్రీనింగ్ టెస్టులతో పాటు ఆప్ లైన్ రిపోర్టులు చేసే తమకు ఆన్ లైన్ రిపోర్టులు కూడా చేయాలంటూ ఒత్తిడి తేవడం దారుణమన్నారు. ఏఎన్ఎంలకు ఇప్పటికే ఆరోగ్యపరమైన చాలా యాప్స్ అప్పగించడంతో 10 నుండి 12 గంటల పాటు పని ఒత్తిడికి గురవుతున్నామని చాలా మంది ఏఎన్ఎంలు బీపీ. షుగర్, స్పాండిలైటీస్ వంటి వ్యాదులకుగురవుతున్నందున ఫీల్డ్ వర్క్ భారమైన తమకు ఎన్సీడీ ఆన్ లైన్ సేవలను అప్పగించకుండా ఆదుకోవాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యురాలు స్వప్నితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు జయమ్మ, పద్మ, తిరుమల, ఎర్రమ్మ, లలిత, మమత, నాగలక్ష్మీ, నాగ శిరీష, సులోచన, జయలక్ష్మీ, సీతమ్మ, భాగ్య, పద్మ, సీతారామమ్మ, రమాదేవి, చంద్రలీల పాల్గొన్నారు.

Next Story