మెగా జాబ్ మేళా లో 400 మంది విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు

by Nallavelli.Anjaneyulu |

కాకతీయ విశ్వవిద్యాలయ ప్లేస్‌మెంట్ సెల్ నిర్వహించిన “మెగా జాబ్ మేళా” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్‌ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు.

మెగా జాబ్ మేళా లో 400 మంది విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు
X

దిశ, హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయ ప్లేస్‌మెంట్ సెల్ నిర్వహించిన “మెగా జాబ్ మేళా” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్‌ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. జాబ్ మేళాను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంచాలకులు డాక్టర్ చిర్రా రాజు అధ్యక్షతన విశ్వవిద్యాలయంలో ప్రముఖ సంస్థలైన సీఐఎస్ టెక్నాలజీస్, పేటియం, గీకే, మేజిక్ బస్ సంస్థలు సుమారు 400 మంది విద్యార్థులకు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అకాడమిక్‌గా ముందుండటం ఒక ఎత్తయితే, నైపుణ్యాలు మరో ఎత్తు అని అన్నారు. అంకితభావం, నిబద్ధత వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య . మనోహర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాళ్లు డా. ఎన్. రమణ, డా. కే. భిక్షాలు, సి.ఐ.ఎస్. టెక్నాలజీస్ ప్రతినిధి కిరణ్, పేటియం సంస్థ ప్రతినిధి ప్రేమ్‌కుమార్, గీకే సంస్థ ప్రతినిధి సందీప్‌కుమార్, మేజిక్ బస్ సంస్థ ప్రతినిధి రాకేష్, ప్లేస్‌మెంట్ అధికారులు డా. సంతోష్, బొల్లం కిరణ్ పాల్గొన్నారు.

Next Story