ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ప్రవీణ్ ఏకగ్రీవం

by velandi.Saikiran |

మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడుగా కనకం ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ప్రవీణ్ ఏకగ్రీవం
X

దిశ, ధర్మసాగర్: మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడుగా కనకం ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫోరమ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల అనిల్ ఆధ్వర్యంలో జరిగిన నూతన మండల కమిటీలో ధర్మసాగర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడుగా పెద్దపెండ్యాల ఉపసర్పంచ్ కనకం ప్రవీణ్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గొట్టం రవివర్మ, వల్లపు రెడ్డి సంధ్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి జోగాల రాజేందర్, కార్యదర్శి ఎస్.కే జలీల్, కోశాధికారిగా ఆకారపు అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు కొంతం కొమరమ్మ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తామని అధ్యక్షుడు ప్రవీణ్ తెలిపారు. కాగా నూతనంగా ఎన్నికైన ప్రవీణ్ ను పలువురు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story