రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నుపూసలాగా విద్యుత్ రంగం : టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ

by Ratna Kumari |   (  Updated:2026-06-02 10:43:49  IST  )

తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం హన్మకొండ , నక్కలగుట్టలో ని ఎన్పీడీసీఎల్ ప్రధా

రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నుపూసలాగా విద్యుత్ రంగం :  టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ
X

దిశ హన్మకొండ టౌన్ : తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం హన్మకొండ , నక్కలగుట్టలో ని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ముందుగా విద్యుత్ భవన్ నుంచి సుబేదారి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమరవీరుల కీర్తి స్తూపం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు . అనంతరం కీర్తి స్తూపం వద్ద అమర వీరులకు ఘనంగా నివాళులు ఆర్పించారు. ఎపిటిఎస్ వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నుపూసలాగా విద్యుత్ రంగం పని చేస్తుందని, అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ శాఖ అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యుత్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అందరం కలసి కట్టుగా పని చేసి వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్షంగా నిబద్ధత్థో పనిచేయాలని రెవెన్యూ పరంగా లాభాలలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story