బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కట్..

by Kodari Anjali |

గ్రామంలో మద్యనిషేధ తీర్మానాన్ని ఉల్లంఘించి బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై నష్కల్ గ్రామ పంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది.

బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కట్..
X

దిశ, జనగామ: గ్రామంలో మద్యనిషేధ తీర్మానాన్ని ఉల్లంఘించి బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై నష్కల్ గ్రామ పంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది. గ్రామంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ సర్పంచ్ శాతబోయిన రాజు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన బొడ్రాయి వేడుకల్లో కొందరు గ్రామస్తులు మద్యం విక్రయించినట్లు తనిఖీల్లో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామసభలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ గతంలోనే తీర్మానం చేసినప్పటికీ, కొందరు దానిని ఉల్లంఘించి బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై గ్రామంలో ఎలాంటి మద్యం విక్రయాలు చేపట్టబోమని సంబంధిత వ్యక్తులు లిఖితపూర్వకంగా హామీపత్రం సమర్పించిన తర్వాతే వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని సర్పంచ్ శాతబోయిన రాజు స్పష్టం చేశారు. గ్రామంలో మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని గ్రామ పంచాయతీ తెలిపింది.

Next Story