వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌ వాయిదా.. వాగ్వాదం..!

by Nallavelli.Anjaneyulu |

ప‌ర‌కాల మున్సిలిటీ చైర్మ‌న్ గా పావుశెట్టి సునీల్ ఎన్నిక‌య్యారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని ఎన్నుకోవాల్సి ఉండ‌గా.. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి కోరం లేనందున రేప‌టికి వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.

వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌ వాయిదా.. వాగ్వాదం..!
X

దిశ, పరకాల : ప‌ర‌కాల మున్సిలిటీ చైర్మ‌న్ గా పావుశెట్టి సునీల్ ఎన్నిక‌య్యారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని ఎన్నుకోవాల్సి ఉండ‌గా.. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి కోరం లేనందున రేప‌టికి వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నుంచి గెలుపొందిన కౌన్సిల‌ర్లు ధ‌ర్నాకు దిగారు. అధికార పార్టీకి తొత్తుగా మారి వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలోని నాలుగో వార్డు నుంచి గెలుపొందిన దివ్య‌కు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీ ఇస్తూ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. విష‌యం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కుల‌తో పాటు కౌన్సిల‌ర్లుగా గెలుపొందిన 9 మంది మున్సిపాలిటీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. అతి ఉత్సాహంతో నాయకుల‌ను గెంటివేయ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏసీపీ స‌తీష్ కుమార్ రంగ ప్ర‌వేశం చేసి ఎంపికకు సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్డీవో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి మాకు స‌మాధానం చెప్పాలంటూ పెద్దఎత్తున ధ‌ర్నా రాస్తారోకో చేప‌ట్ట‌డంతో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ప్ర‌కారం.. గొడ‌వ‌ల‌కు దిగిన ప్ర‌తి ఒక్క‌రిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. మాపై కేసులు పెట్టినా.. మేము త‌గ్గేదే లేదు. మ‌మ్మ‌ల్ని బ‌య‌టికి పంపించి వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని ఎలా ఎన్నుకుంటారు అని ప్ర‌శ్నించారు. వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని ఎన్నుకోవాలంటే కోరం ఉండాలి అంటూ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఎన్నిక చెల్ల‌కుండా చేస్తామ‌ని విమ‌ర్శించారు.

Next Story