- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా పోషణ పక్వాడ ప్రాజెక్టు స్థాయి సమావేశం
ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మహబూబాబాద్ పరిధిలోని లబ్ధిదారులు, గర్భిణులు, బాలింతలు, ప్రీ-స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, అంగన్ వాడీ టీచర్లకు సంబంధించిన పోషణ పక్వాడ ప్రాజెక్టు స్థాయి సమావేశం నిర్వహించారు.

దిశ, మహబూబాబాద్ టౌన్ : ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మహబూబాబాద్ పరిధిలోని లబ్ధిదారులు, గర్భిణులు, బాలింతలు, ప్రీ-స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, అంగన్ వాడీ టీచర్లకు సంబంధించిన పోషణ పక్వాడ ప్రాజెక్టు స్థాయి సమావేశం నిర్వహించారు. గురువారం సీడీపీవో శిరీష అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి సబితా, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ నాగవాణి, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఇంటి వంట ఆహార పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 3-6 సంవత్సరాల వయస్సు గల ప్రీ-ప్రైమరీ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఆడబిడ్డను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం అనే నినాదంతో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 10 మంది తల్లులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. బాలమేళ నిర్వహించి చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలింతలకు చిన్నారులకు ఉగ్గు తినిపించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్లు పద్మావతి, కవిత, అంగన్ వాడీ టీచర్స్ సులోచన, కాటరోజా, స్నేహ బిందు, పోషణ అభియాన్ బీసీ, సఖి సిబ్బంది పాల్గొన్నారు.






