విధుల్లో పోలీస్.. ఇంట్లో దొంగ

by Ratna Kumari |

ప‌ట్ట‌ప‌గ‌లే ఓ ఇంట్లో దొంగలు పడ్డ ఘటన పట్టణ కేంద్రంలో కలకలం సృష్టించింది.

విధుల్లో పోలీస్.. ఇంట్లో దొంగ
X

దిశ, డోర్నకల్: ప‌ట్ట‌ప‌గ‌లే ఓ ఇంట్లో దొంగలు పడ్డ ఘటన పట్టణ కేంద్రంలో కలకలం సృష్టించింది. ఎ స్సై ఉమ కథనం ప్రకారం.. న్యూ నెహ్రూ స్ట్రీట్ లో అద్దె ఇంట్లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సతీమణితో కలిసి ఖమ్మం నగరానికి వెళ్లారు. తిరిగి కోటేశ్వరరావు ఇంటికి చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు తాళం పగలగొట్టి రూ.40 వేలు,వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో క్లూస్ టీం ఆధారాలు సేకరణలో నిమగ్నమయ్యారు. సీఐ చంద్రమౌళి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆమె తెలిపారు.

Next Story