- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సత్య శారద
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

దిశ, వరంగల్ బ్యూరో : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద జెండా ఊపి ప్రారంభించారు. ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్‌కు రూ. 30 వేలు, రెండు కిలోవాట్లకు రూ. 60 వేలు, మూడు కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ప్లాంట్లకు రూ. 78 వేల వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు.
గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, మిగిలిన విద్యుత్తును పవర్ గ్రిడ్‌కు అందజేసి అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సమాఖ్యల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, టిజిరెడ్ కో జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్ యాదవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






