కేయూ ఇంజనీరింగ్ విద్యార్థినులు 254 మందికి ప్లేస్మెంట్స్

by Ratna Kumari |

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్టార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం చేతుల మీదుగా శుక్రవారం విద్యార్థినులకు ప్లేస్మెంట్ నియామక పత్రాలు అందజేశారు.

కేయూ ఇంజనీరింగ్ విద్యార్థినులు 254 మందికి ప్లేస్మెంట్స్
X

దిశ, హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్టార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం చేతుల మీదుగా శుక్రవారం విద్యార్థినులకు ప్లేస్మెంట్ నియామక పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 254 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. యూనివర్సిటీ పరిధిలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల పలు కోర్సులో సీఎస్సీ లో 46 మంది, ఐటీ లో 33 మంది, త్రిబుల్ఈ లో 65 మంది, ఈసీ లో 81 మంది, ఏఐఎంఎల్ లో 29 మందికి 5. 5 ప్యాకేజీలలో సెలెక్ట్ అయ్యారని వీసీ తెలిపారు. అనంతరం వీసీ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో మహిళలు ప్రభుత్వ ప్రైవేటు రంగా సాప్ట్ వేర్ విభాగాల్లో నియామకం అవ్వడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన కోర్సులు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విశ్వవిద్యాలయానికి తెలంగాణలోనే మంచి పేరు వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకట్ రామ్ రెడ్డి, పాలకమండలి సభ్యులు రాజు, ప్రొఫెసర్ వెంకయ్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Next Story