Warangal Floods: వరంగల్‌లో వరద కన్నీరు.. ఫొటో ఫీచర్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-07-27 09:03:21  IST  )

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి.

Warangal Floods:  వరంగల్‌లో వరద కన్నీరు.. ఫొటో ఫీచర్
X

దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా జాతీయ రహదారులు సైతం వరద గుప్పిట్లో చిక్కుకోని రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరద పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి జనజీవనాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేశాయి. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. కాల్వలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది.


































Read More : తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షపాతం నమోదు

Next Story