- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యకర జీవనశైలి పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
ఆరోగ్యకర జీవనశైలి పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ప్రపంచ ఊబకాయం దినోత్సవం సందర్భంగా వరంగల్‌లోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద వాకథాన్ నిర్వహించి ఊబకాయం ప్రమాదాలు, ఆరోగ్యకర జీవనశైలి , క్రమమైన శారీరక వ్యాయామం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ వాకథాన్‌కు మెడికవర్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ సంతోష్ మోదాని (సీనియర్ కార్డియాలజిస్ట్), డాక్టర్ అభిజాన్ (పల్మనాలజిస్ట్), డాక్టర్ అరుణ్ కుమార్ (ఫిజీషియన్) తదితర వైద్య బృందం నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఊబకాయం పెరుగుతున్న సమస్యగా మారుతున్నదని, దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు.






