జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

by Elthuri vijay kumar |

గ్రామ పంచాయతీ సిబ్బంది 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఇతర డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది గ్రామపంచాయతీ కార్మికులతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు.

జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
X

జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

- జీతాలు చెల్లించకుంటే భిక్షాటన చేపట్టి నిరసన తెలుపుతాం

- గ్రామపంచాయతీ యూనియన్ నేతల హెచ్చరిక

దిశ,జనగామ : గ్రామ పంచాయతీ సిబ్బంది 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఇతర డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది గ్రామపంచాయతీ కార్మికులతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ యూనియన్ ( సిఐటియు) జిల్లా కార్యదర్శి నా రోజు రామచంద్రం జిల్లా కోశాధికారి బస్వ రామచంద్రం లు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించకుంటే పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.దసర పండుగ సందర్భంగా బట్టలు, సబ్బులు, నూనెలు, ఇతర సేఫ్టీ పరికరాలను ఇవ్వాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల కు చెల్లించాలని తెలిపారు.2వ పిఆర్సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలి. జివో నెం:60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లు కల్పించాలన్నారు.పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రీటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇన్సురెన్సు, ఇఎస్ఐ, పిఎఫ్. భోనస్ సౌకర్యం కల్పించాలి అని అన్నారు కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని. వేతనాలు పెంచాలని కోరారు ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడ వేతనాలు చెలించాలి. పంచాయతీల అవసరాల ప్రతిపాధికన కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు.

కార్మికులందరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అనారోగ్యానికి గురైన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రతి పంచాయతీలో ట్రాక్టర్లకు ఇన్సురెన్సు ప్రభుత్వమే చేయించాలి. డ్రైవర్లకు లైసెన్సు ఇప్పించాలని కోరారు.ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలనుపరిష్కరించ కుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపిఓ సూపర్ డెంట్ వసంత కు మరియు జిల్లా కలెక్టరేట్ ఏవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో సిఐటియు గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు పి వెంకటేశ్వర్లు ఎస్ కర్ణాకర్ పి మల్లేష్ బి బాల నరసయ్య జే కలమ్మ సైదమ్మ రమ లావణ్య రమణ రేణుక యాదమ్మ కవిత జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Next Story