- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పై పెద్ది సుదర్శన్ ఫైర్..బ్రోకర్ పార్టీ అంటూ !
మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను డోకా చేసిన బ్రోకర్ పార్టీ... కాంగ్రెస్ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ర

దిశ, నెక్కొండ: మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను డోకా చేసిన బ్రోకర్ పార్టీ... కాంగ్రెస్ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవాచేశారు. గ్యారంటీ కార్డు పేరు చెప్పి అమాయక రైతులను,మహిళలను,విద్యార్థులను నట్టేట ముంచిందని అన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క యూరియా బస్తా ఇవ్వలేక విఫలం అయిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగని.సూరయ్య,సొసైటీ చైర్మన్ మారం.రాము,మాజీ ఎంపీపీ జాటోతు,రమేష్,మాజీ జడ్పీటీసీ సరోజా హరికిషన్,సీనియర్ నాయకులు కొమ్ము.రమేష్ యాదవ్,కొమ్మారెడ్డి.రవీందర్ రెడ్డి,వీరభద్రం,వాగ్యా నాయక్, తోట.సాంబయ్య,మాతంగి.రాజు,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






