- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో పెద్దవంగర తహసిల్దార్
మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఏసీబీ అధికారులకు తాసిల్దార్ మహేందర్ పట్టుబడ్డారు.

దిశ, పెద్దవంగర : మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఏసీబీ అధికారులకు తాసిల్దార్ మహేందర్ పట్టుబడ్డారు. మండల పరిధిలోని పోచంపల్లి గ్రామ శివారు పడమటి తండ వాస్తవ్యులు లేట్ భూక్య స్వామి కి చెందిన మూడు ఎకరాల తొమ్మిది గంటల (3.09) భూమిని తన కుమారుడు భూక్య బాలుకు మ్యుటేషన్ చేయమని కుటుంబ సభ్యులు సెప్టెంబరు 25వ తారీకున మీ సేవ లో అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత తాసిల్దార్ మేరకు ఆర్ఐ గ్రామానికి వెళ్లి భూమి వివరాలు తెలుసుకొని తాసిల్దార్ కు వివరించారు, అనంతరం కుటుంబ సభ్యులను ఆఫీసుకు పిలిపించి భూమికి సంబంధించి డిజిటలైజేషన్ (స్లాట్ బుకింగ్) చేసుకోమని చెప్పారు. కుటుంబ సభ్యులు భూక్య బాలు పేరుమీద అక్టోబర్ 24 తారీఖున స్లాట్ బుక్ చేసుకున్నారు, భూమి విషయంపై తాసిల్దార్ ముందుకు వెళ్లకపోగా, భూమి మార్చడానికి 20వేల రూపాయలు ఇస్తే మారుస్తానని లేకపోతే లేదని చెప్పడం జరిగింది. బాలు భార్య సాధ్వి తన బాబాయి మురళి నాయకతో కలిసి విషయం చెప్పగా తాసిల్దార్ ని బ్రతిమాలిన వినకపోవడంతో, వరంగల్ ఏసీబీ ఆఫీస్ ని సంప్రదించి అర్జీ పెట్టుకున్నారు, వారి సూచన మేరకు నవంబర్ 26వ తారీకు తాసిల్దార్ ఆఫీస్ కి వెళ్ళి భూమిని కొటేషన్ చేయమని ప్రాధేయపడిన వెనక డబ్బులు డిమాండ్ చేయడంతో మేము ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఏసీబీ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో తహసిల్దార్ డ్రైవర్ భరత్ కు 15000/- రూపాయలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్.రాజు, ఎల్.రాజులు పక్కా ప్లాన్ తో పట్టుకోవడం జరిగింది.






