అంబరాన్నంటిన పెద్దమ్మ తల్లి పండుగ

by Ratna Kumari |

భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జరిగింది.

అంబరాన్నంటిన పెద్దమ్మ తల్లి పండుగ
X

దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు నాగిళ్ల కృష్ణమూర్తి, కోటేశ్వర చారి, చక్రచారి వేదమంత్రాల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు. వేదోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక తేజస్సుతో మార్మోగింది. అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులతో పెద్దమ్మ తల్లి కిటకిటలాడింది. సాయంత్రం వేళ ముదిరాజ్ కులస్తులు భారీ సంఖ్యలో పెద్దమ్మ తల్లి బోనాలతో డప్పు చప్పుల మధ్య డీజే సౌండ్ లతో యువతి యువకుల ఆట పాట నృత్యాలతో విను వీధుల్లో నడుస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల వెంట సాగిన శోభాయాత్రతో ముల్కనూరు గ్రామం భక్తి శోభతో కళకళలాడింది. చండీ హోమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. పెద్దమ్మ తల్లి నామస్మరణతో ముల్కనూరు గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంచు చంద్రమౌళి, ఇట్టవేన నాగరాజు, గీకురు ఐలయ్య, దొంతరవేన పోచయ్య, దొంతరవేన రవి, దొంతరవేన స్వామి, ఇట్టవేన కృష్ణమూర్తి, కూన పెద్ద కనుకయ్య, కూన చిన్న కనుకయ్య, కూన రమేష్, పీసర కనుకయ్య, అలుగు రాజకొంరయ్య, అలుగు వెంకటస్వామి, మారుపాక రాజ మొగిలి, చుంచు ఐలయ్య, సుంచు విక్రమ్, డుబ్బుల కృష్ణ,పెంచికల జైపాల్ పాల్గొన్నారు.

Next Story