పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత

by Ratna Kumari |   (  Updated:2026-05-15 14:20:11  IST  )

అక్రమంగా తరలించేందుకు స్టాక్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపెడ రెవెన్యూ, పోలీసు అధికారులు శుక్రవారం సంయుక్తంగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.

పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత
X

దిశ, మరిపెడ : అక్రమంగా తరలించేందుకు స్టాక్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపెడ రెవెన్యూ, పోలీసు అధికారులు శుక్రవారం సంయుక్తంగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శరత్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పలువురు రేషన్ డీలర్ల నుంచి బియ్యం సేకరించి మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురంలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో స్టాక్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పట్టణంలోని సీతారాంపురం ఏరియా డబుల్ బెడ్ రూమ్ కాలనీ లో 13వ నంబర్ గల ఇంటిలో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వచేసిన సుమారు 90క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించడం జరిగింది. వెంటనే రేషన్ బియ్యాన్ని ఎఫ్సిఐ గోదాంకు తరలించినట్లు ఆర్ఐ తెలిపారు.

Next Story