- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా భూములకు నష్ట పరిహారం చెల్లించండి
by Bhanu |
తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ -2 ప్రాజెక్టు ముందు భూనిర్వాసితుల శుక్రవారం ఆందోళన చేపట్టారు.

X
దిశ భూపాలపల్లి ప్రతినిధి : తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ -2 ప్రాజెక్టు ముందు భూనిర్వాసితుల శుక్రవారం ఆందోళన చేపట్టారు.ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్, కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ జంగేడు, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఓపెన్ కాస్టు- 2 ప్రాజెక్టు ముందు ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తమ భూములు తీసుకొని సింగరేణి సంస్థ ఇప్పటివరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టిన స్పందించడం లేదని వెంటనే సింగరేణి యాజమాన్యం తమ భూములను, ఇండ్లను తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని వారు తెలిపారు.
Next Story






