ములుగు జిల్లా అభివృద్ధికి బాటలు వేయండి

by Ratna Kumari |

ములుగు చిన్న జిల్లా అని.. ఈ జిల్లా అభివృద్ధి కోసం చొరువ చూపాలని, జిల్లాలో చేసే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు.

ములుగు జిల్లా అభివృద్ధికి బాటలు వేయండి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు చిన్న జిల్లా అని.. ఈ జిల్లా అభివృద్ధి కోసం చొరువ చూపాలని, జిల్లాలో చేసే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న బోర్ఖడే హేమంత సహ దేవరావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మంత్రి సీతక్క జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లా యంత్రాంగం అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, ఉపాధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ పౌడాల ఓం ప్రకాష్ త‌దితరులు పాల్గొన్నారు.

Next Story