తల్లిదండ్రుల సహకారమే విద్యార్థుల విజయానికి బలం

by Elthuri vijay kumar |

తల్లిదండ్రుల సహకారమే విద్యార్థుల విజయానికి బలమని ప్రిన్సిపాల్ బానోత్ వెంకన్న అన్నారు.

తల్లిదండ్రుల సహకారమే విద్యార్థుల విజయానికి బలం
X

తల్లిదండ్రుల సహకారమే విద్యార్థుల విజయానికి బలం

కొత్తగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ వెంకన్న

తల్లిదండ్రుల, అధ్యాపకుల ప్రత్యేక సమావేశం

దిశ, కొత్తగూడ :తల్లిదండ్రుల సహకారమే విద్యార్థుల విజయానికి బలమని ప్రిన్సిపాల్ బానోత్ వెంకన్న అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో తల్లిదండ్రుల, అధ్యాపకుల ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేసి ఈసందర్బంగా ప్రిన్సిపాల్ బానోత్ వెంకన్న మాట్లాడుతూ...విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి, ఉన్నత స్థాయిలో ఎదగడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకం. పిల్లలకు క్రమశిక్షణతో కూడిన చదువు అలవాటు చేస్తేనే వారు విజయాన్ని సాధిస్తారాని విద్యార్థుల లోపలి ప్రతిభను వెలికి తీయడంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. ఇలాంటి మీటింగ్‌లు విద్యార్థుల అభివృద్ధి దిశగా ముందడుగు వేయడానికి దోహదం చేస్తాయి అంటూ ఈ సమావేశం ద్వారా విద్యార్థుల చదువులోని ప్రగతి, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పడ్తయ్య,సత్యనారాయణ,అశోక్, నాగరాజు, శివ,వార్డెన్స్ కర్ణాకర్, అనూష విద్యార్థుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు

Next Story