- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యదర్శి "చేతి" వాటం
ప్రత్యేక అధికారి పాలనలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. తప్పుడు బిల్లులతో ఏకంగా రూ.8,70,000 స్వాహ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి ఉదంతం కే సముద్రం మండలంలోని బిచ్చనాయక్ తండాలో చోటు చేసుకుంది.

దిశ, కేసముద్రం : ప్రత్యేక అధికారి పాలనలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. తప్పుడు బిల్లులతో ఏకంగా రూ.8,70,000 స్వాహ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి ఉదంతం కే సముద్రం మండలంలోని బిచ్చనాయక్ తండాలో చోటు చేసుకుంది. సర్పంచ్ వాంకుడోట్ రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు నెలలుగా చేసిన అభివృద్ధి పనులకు తీర్మాణం ఇవ్వకుండా సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడని కార్యదర్శి వాపోయాడు. అయితే ప్రత్యేక పాలన సమయంలో కార్యదర్శి రూ.8,70,000 ఖర్చు చేశానని వాటిపై సంతకం పెడితేనే తీర్మాణం ఇస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సర్పంచ్ వాంకుడోత్ రవి నాయక్ వాపోయాడు. ప్రత్యేక అధికారి పాలన సమయంలో చేసిన పనులకు బిల్లుల లెక్కలు అడిగితే మీన మేషాలు లెక్కిస్తూ..దుర్భాషలాడుతున్నాడని సర్పంచ్ వాపోయాడు. ప్రత్యేక పాలన సమయంలో చేసిన అభివృద్ధి లేదని.. పంచాయతీకి రూ.8లక్షలకు పైగా ఏమి ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.6లక్షలు ఖర్చు అయితే.. కేవలం 500 మంది ఉన్న పంచాయతీకి రూ.8,70,000 ఖర్చు ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం చొరువ చూపించి ఈ కార్యదర్శిని వెంటనే పంచాయతీ నుంచి బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.






