పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

by velandi.Saikiran |

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్

పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
X

దిశ, పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార దంపతులు, నిర్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి,ఎడ్ల శ్రీను పలువురు కాంగ్రెస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా పార్టీ కోసం నిరాంతరం శ్రమించమని గుర్తు చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపుకోసం రేయింబవళ్ళు కష్టపడిన‌ట్లు తెలిపారు. కానీ ఇప్పుడు పార్టీలో త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక

పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార, నాయకులు ఇప్ప పృథ్వి రెడ్డి, నిర్మాల కాంటెస్టెడ్ సర్పంచ్ వడ్లకొండ ప్రశాంత్, నిర్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి, తీర్పెల్లి కొండల్ రెడ్డి, ఎడ్ల శ్రీను మరికొందరు శనివారం ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎర్రబెల్లి. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ గౌడ్,జిల్లా నాయకులు పల్ల సుందర్ రాంరెడ్డి,రమేష్ రెడ్డి, ఏల సోమ సుందర్, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ,రాంసింగ్,చింత రవి,జలంధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story