- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

దిశ, గీసుగొండ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న గణిపాక బాబు (56) పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన గీసుగొండ పోలీసు స్టేషన్‌లో నమోదైంది.
గీసుగొండ సీఐ ఎ. మహేందర్ అందించిన వివరాల ప్రకారం.. గణిపాక బాబు జీడబ్ల్యూఎంసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత నెల 25న రెడ్డిపాలెం వద్ద తన ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు జారిపడడంతో ఆయనకు ఛాతి భాగంలో తీవ్ర గాయం అయ్యింది. అప్పటి నుండి ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతూ వచ్చారు.
ఈ నొప్పిని తట్టుకోలేక జూన్ 2వ తేదీన ఇంట్లో ఉండగానే పురుగుల మందు సేవించగా, ఇది గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న గణిపాక బాబు బుధవారం (జూన్ 4) మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మృతుడి భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






