- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానికేతర గిరిజనుల ఆగడాలపై ఆగ్రహం
రామాలయం ప్రాంగణంలో స్థానిక గిరిజనేతరులు సమావేశమై గిరిజనేతర ఐక్య జేఏసీ కమిటీ ఏర్పాటు చేశారు.

దిశ, ఏటూరు నాగారం: స్థానిక గిరిజనేతర ప్రజలు ఐక్యంగా భూవివాద సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజల సమస్యగా అందరూ భావించి ముందుకు వెళ్లాలని చిటమట రగు, సరీ కొప్పుల శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో స్థానిక గిరిజనేతరులు సమావేశమై గిరిజనేతర ఐక్య జేఏసీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన కుల పెద్దలను గౌరవ సలహాదారులుగా, అధ్యక్షులుగా నియామకం చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న భూవివాద వివాదంపై ఈ కమిటీ జిల్లా కలెక్టర్, స్థానిక తాసిల్దార్, ఏ ఎస్ పి, మంత్రి సీతక్కలను కలిసి సమస్యను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు.
పలువురు స్థానికేతర గిరిజనేతర మహిళలు తమ స్వలాభం కోసం సంపాదనే ధ్యేయంగా చేసుకుని ఎక్కడైతే ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ ప్రాంతాలలో రాత్రికి రాత్రి గుడారాలు వేస్తూ గిరిజనేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. దీని నియంత్రకై గురువారం గ్రామ పెద్దలందరూ సమావేశమైనట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, కాంగ్రెస్ నాయకులు ఇరుస వడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, బిజెపి నాయకులు సిపిఐ నాయకులు చక్రవర్తి, ఎండి దావూద్ పాల్గొన్నారు.






