- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ జిల్లాకు బిగ్ అలర్ట్.. రెండు గంటల్లో భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు ముంచెత్తుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రెండు గంటల్లో నగరంలో కుండపోత వర్షం కురుస్తుందని తెలుపుతూ.. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్ లో ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి అండర్ రైల్వే బ్రిడ్జి వరదనీటితో నిండిపోగా.. రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. దీంతో పోలీసులు తాళ్ల సహాయంతో బస్సుల్లోని ప్రయాణికులను రక్షించారు. భారీవర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకూ వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పైడిపల్లిలో 7 సెంటీమీటర్లు, దామెరలో 6.4, సంగెంలో 4.2, ఖిల్లావరంగల్ లో 5.6, కాశీబుగ్గలో 4.1, గీసుకొండలో 3.9, గొర్రెకుంటలో 3.7, దుగ్గొండి, నెక్కొండలో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.






