- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విత్తన స్కామ్‌లో బలిపశువులేనా?
వికారాబాద్ జిల్లా వ్య వసాయ శాఖలో విత్తన సబ్సిడీ కుం భకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా దౌలతాబాద్, బషీరాబాద్, కొడంగల్, బొ మ్మరాస్‌పేట, దోమ, కుల్కచర్ల, దు ద్యాల్ మండలాల్లో భారీ ఎత్తున వి త్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారం లో ఉన్నతాధికారుల చర్యలు ఇప్పు డు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నా యి.

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా వ్య వసాయ శాఖలో విత్తన సబ్సిడీ కుం భకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా దౌలతాబాద్, బషీరాబాద్, కొడంగల్, బొ మ్మరాస్‌పేట, దోమ, కుల్కచర్ల, దు ద్యాల్ మండలాల్లో భారీ ఎత్తున వి త్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారం లో ఉన్నతాధికారుల చర్యలు ఇప్పు డు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నా యి. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను పూర్తిగా తుంగలో తొక్కి, అసలు బాధ్యులైన మండల వ్యవసాయ అధికారులను, డివిజన్ అధికారులను కాపాడటానికి కింది స్థాయి అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ ను బలిపశువులను చేస్తున్నారనే నిజాలు బట్టబయలవుతున్నాయి.
ఏడు మండలాల నెట్‌వర్క్.. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్!
ఇది కేవలం ఒకరిద్దరు ఏఈఓలు కలిసి చేసిన చిన్న తప్పు కాదు. ఏడు మండలాల పరిధిలో ఒకే పద్ధతిలో విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయంటే, దీని వెనుక ఒక పక్కా ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్ పనిచేసిందని స్పష్టమవుతోంది. బషీరాబాద్, దోమ, కుల్కచర్ల ఏఓల పాత్రపై విచారణ ఏది? వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో కేవలం బొమ్మరా స్‌పేట, దౌలతాబాద్, దుద్యాల్ మం డలాల ప్రస్తావన మాత్రమే ఉంది. మరి ఇదే తరహా ఫ్రాడ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బషీరాబాద్, దోమ, కుల్కచర్ల మం డలాల ఏఓల అక్రమాలను ఎందుకు తొక్కిపెట్టారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పెద్దలను వదిలేసి.. క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు!
వికారాబాద్ జిల్లాలో విత్తన పంపి ణీ, వేరుశనగ కొనుగోళ్లలో జరిగిన భారీ అవినీతిపై జిల్లా వ్యవసాయ శాఖ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారుల ను, పెద్ద అధికారులను కాపాడేందుకే కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శాఖాపరమైన చర్యలు..
దౌలతాబాద్ మండలం గోకఫస్లాబాద్, బొమ్మరాస్‌పేట మండలం మెట్లకుంట క్లస్టర్ ఏఈవోలను సర్వీస్ నుంచి తొలగించారు. దుద్యాల మండల ఏవోను సస్పెండ్ చేశారు. కొడంగల్ ఏడీఏను ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏడీఏ నిఘా వైఫల్యం..
డివిజన్ స్థాయిలో ప్రతి 15 రోజు లకు ఒకసారి మండలాల స్టాక్‌ను తనిఖీ చేయాల్సిన కొడంగల్ ఏడీఏ కే శంకర్ రాథోడ్ మూడు నెలలుగా ఈ ఏడు మండలాల్లో ఎలాంటి తని ఖీలు నిర్వహించారు? అని తేలాల్సి ఉంది. ఆయన లాగ్‌బుక్ రికార్డులను ఎందుకు సీజ్ చేయలేదు? కేవలం 'సరెండర్' పేరుతో ఆయన్ను సేఫ్ జోన్‌కు ఎందుకు పంపారు? 'సరెండర్', 'సస్పెన్షన్లతో' సరిపెడితే సరిపోతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. విత్తనాలు లభించ క రైతులు అల్లాడుతుంటే, నిబంధనలను ఉల్లంఘించిన ఉన్నతాధికారులపై కేవలం 'సరెండర్', 'సస్పెన్షన్' వంటి తేలికపాటి చర్యలతో వ్యవసా య శాఖ చేతులు దులుపుకుంటోం ది. గైడ్‌లైన్స్ ప్రకారం ప్రభుత్వ సొ మ్ము దుర్వినియోగం అయినప్పుడు బాధ్యులైన అందరు ఏఓలు, ఏడీఏలపై క్రిమినల్ కేసులు ఎందుకు న మోదు చేయలేదు? రైతుల పేరుతో దారిమళ్లిన విత్తనాల విలువను సదరు అధికారుల జీతాలు, ఆస్తుల నుంచి ఎప్పుడు రికవరీ చేస్తారు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒక క్వింటాల్ ఇస్తే..
రెండు క్వింటాళ్లని రాశారు!
గోకఫసల్‌వాడ్ గ్రామానికి చెందిన రైతు అప్పలి మల్లేశ్ ప్రభుత్వ సబ్సిడీ కేంద్రం నుంచి కేవలం ఒక్క క్వింటాల్ విత్తనాలను మాత్రమే తీసుకున్నారు. కానీ వ్యవసాయ అధికారుల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లలో మాత్రం సదరు రైతు రెండు క్వింటాళ్ల విత్తనాలు తీసుకున్నట్లు తప్పుడు లెక్కలు రాశారు.
ముంబైలో ఉన్నోళ్లకు విత్తనాల పంపిణీ
గ్రామానికి చెందిన రమణి సాయిలు అనే రైతు ఇచ్చిన సాక్ష్యం మరింత సంచలనం సృష్టిస్తోంది. "మాకు వేరుశనగ విత్తనాల సంగతే తెలియదు. మా వదిన చాలా కాలంగా బాంబే (ముంబై) లో ఉంటోంది. కానీ ఇక్కడి వ్యవసాయ అధికారులు ఆమె పేరు మీద వేరుశనగ విత్తనాలు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు" అని సాయిలు వాపోయారు.






