నేషనల్ లెవల్‌లో ‘ఆర్య’ హంగామా.. భారీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్

by Pulgam srinivas |

ఆర్య’ సినిమాను 4Kలో దేశవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నేషనల్ లెవల్‌లో ‘ఆర్య’ హంగామా.. భారీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాల్లో ఆర్య ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బన్నీ కెరీర్‌లో రెండో చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌కి అప్పట్లో ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ నటించిన పలు సినిమాలను వరుసగా రీ-రిలీజ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే హ్యాపీ సినిమాను మలయాళంలో రీ-రిలీజ్ చేయగా అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆర్య’ సినిమాను కూడా 4K క్వాలిటీతో రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసారి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, నార్త్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో ఈ సినిమాను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో ‘ఆర్య’ రీ-రిలీజ్‌కు కూడా మంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు తెలుగు నుంచి అనేక సినిమాలు రీ-రిలీజ్ అయినప్పటికీ ఒకేసారి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఉదాహరణలు చాలా తక్కువ. దీంతో ‘ఆర్య’ సినిమాను ఆ తరహాలో ప్లాన్ చేస్తున్నారని తెలిసి అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story