ఆపరేషన్ తొర్రూర్ మున్సిపాలిటీ..!

by Nallavelli.Anjaneyulu |

తొర్రూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందా? ఎర్రబెల్లి కి బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసిందా.? ఇవాళ, రేపట్లో సమీకరణాలు వేగంగా మారనున్నాయా?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆపరేషన్ తొర్రూర్ మున్సిపాలిటీ..!
X

దిశ, మహాబూబాబాద్/తొర్రూర్ : తొర్రూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందా? ఎర్రబెల్లి కి బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసిందా.? ఇవాళ, రేపట్లో సమీకరణాలు వేగంగా మారనున్నాయా?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొర్రూర్ మున్సిపాలిటీ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠ కి తెరలేపుతుంది.రేపు చైర్మన్ ,వైస్ చైర్మన్ ల ఎన్నిక ఉండటంతో బిగ్ ట్విస్టులు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతుంది.మొత్తం 16 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 9 వార్డులను బి.ఆర్.ఎస్ కైవసం చేసుకుంది.చైర్మన్ పీఠం తమదేనని భావించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించడంతో కథ అడ్డం తిరగబోతుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఏడు చోట్ల గెలుపొందగా.. ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు తో ఎనిమిదికి బలం పెరిగింది. అయితే ఎంపీ కడియం కావ్య కూడా ఇక్కడే ఓటు వినియోగించుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సమానం అయ్యాయి. అనూహ్యంగా ఓ మంత్రి చోరవతో బీఆర్ఎస్ త‌రపున గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న అ పార్టీ కీలక నేత బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఒక్కరిద్దరికీ అత్యంత సన్నిహితుడుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అ మంత్రి కీలక నాయకునీ తో మంతనాలు జరిపినట్టు ప్రచారం సాగుతుంది. నేనున్నాను అంటూ భరోసానివ్వడమే కాకుండా మీరు చెప్పినట్టే మీతో కలిసి ఝాన్సీ రెడ్డి పని చేస్తుందంటూ హామీ సైతం ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. దీంతో ఆ కీలక నేత బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు పొలిటికల్ సర్కిల్లో వినపడుతున్న మాట. ఇందులో భాగంగా ఒకరికి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు డీల్ కుదిరిందని ప్రచారం సాగుతుంది. అలాగే మరో కౌన్సిలర్ కు కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. వీరిలో ఏ ఒక్క రూ కాంగ్రెస్ గూటికి వచ్చిన తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. ఝాన్సీ రెడ్డి సైతం ఈ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని ప్రచారాలు, ఊహాగానాల మధ్య రేపు చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎవరు కానున్నారో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అదంతా అసత్య ప్రచారమే : ఎర్రబెల్లి దయాకర్ రావు.!

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్కరిద్దరూ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.ఈ మేరకు గెలిచిన వార్డ్ కౌన్సిలర్లతో ఒక వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్ ఎంపీ ఓటు అక్కడే అప్రూవల్ చేసుకుందని తొర్రూర్ మున్సిపాలిటీలో వినియోగించుకునే అవకాశం లేదని కొట్టి పారేయడం జరిగింది. హాంగ్ ఏర్పడినప్పుడే ఎక్స్- అఫీషియో ఓటు వినియోగించుకోవడానికి వీలుంటుందని కాదని ఓటు వినియోగించుకుంటే కోర్టులో ఒక్క రోజులోనే ఆర్డర్ వస్తుందని చెప్పుకొచ్చారు. కావాలనే రాజ్యసభ సభ్యుడు రవి చంద్ర,ఎమ్మెల్సీ పోచంపల్లి ల ఓటు హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించడం జరిగింది. 9 మంది కౌన్సిలర్లు కూడా ఎర్రబెల్లి తోనే ఉన్నామంటూ కుండబద్దలు కొట్టారు.

Next Story