- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలి
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపించాలని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పిలుపునిచ్చారు.

దిశ, గూడూరు : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపించాలని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పిలుపునిచ్చారు. గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి వాంకుడోత్ సునీత కొమ్మాలు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే స్వయంగా హాజరై ఎంపీడీవో కార్యాలయం నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు మహిళలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నడిచి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు, అలాంటి వాటికి తావూ లేదని స్పష్టం చేశారు. పార్టీకి కష్టపడి, జెండా మోసి పనిచేసిన నిజమైన కార్యకర్తలకే సర్పంచ్ అవకాశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత మొదటగా హాజరైన నామినేషన్ ఇదేనని, గూడూరు నుంచి భారీ మెజారిటీతో గెలిపించి జిల్లా కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా అందించాలి అని ఉమా మురళి నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జేన్నారెడ్డి, భరత్ చందర్ రెడ్డి, రమేష్ చందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మండల అధ్యక్షులు చిట్టె వెంకన్న, బీరం శ్రీపాల్ రెడ్డి, కొమ్మాలు, మాదాసు రమేష్, ఓర్సు బిక్షమయ్య, రాసమల్ల యాకయ్య, శ్రీనివాస్, షాజహాన్, సురేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






