రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మ‌రొక‌రికీ తీవ్ర గాయాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ, లింగాల ఘణపురం : రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌డంతో పాటు మ‌రొక‌రికీ తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న లింగాల ఘ‌న‌పురం మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మ‌రొక‌రికీ తీవ్ర గాయాలు
X

దిశ, లింగాల ఘణపురం : రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌డంతో పాటు మ‌రొక‌రికీ తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న లింగాల ఘ‌న‌పురం మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌న‌గామ నుంచి సూర్య‌పేట వైపు వెళ్తున్న కారు.. వ‌డ్డీ గ్రామం వ‌ద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న విజ‌య‌వాడ‌కు చెందిన‌ బ‌బ్లు(32) అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. రాంప్ర‌సాద్ కి తీవ్ర గాయాల‌య్యాయి. కుడికాలు, ఎడ‌మ‌చేయి విరిగిపోయింది. ల‌వ‌కుమార్, శ‌ర‌త్ కుమార్ కి స్వ‌ల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జ‌న‌గామ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story