- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఎన్పీ డీసీఎల్ లో వన్ మినిట్ రూల్
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లో “వన్ మినిట్ రూల్” అనే ప్రత్యేక భద్రతా విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.

దిశ, హన్మకొండ టౌన్ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లో “వన్ మినిట్ రూల్” అనే ప్రత్యేక భద్రతా విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ నియమం ద్వారా ప్రతి పనికి ముందుగా కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి అవసరమైన భద్రతా చర్యలను పరిశీలించడం తప్పనిసరి చేయబడిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ మినిట్ రూల్” అంటే క్షేత్ర స్థాయిలో పనిని ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు ఆగి, అన్ని భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం ఈ నియమం ముఖ్య ఉద్దేశ్యమని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున, ఈ ఒక్క నిమిషం సమయం ప్రాణాలను కాపాడగలదని సూచించారు. ఈ నియమం ద్వారా ప్రమాదాలను తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రతి ఉద్యోగి ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలనే దిశగా టిజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.






