- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Medaram Jatara 2026: అంతా హైజీన్... కొబ్బరి చిప్పల సేకరణలో వంద మంది
Medaram Jatara 2026: అంతా హైజీన్... కొబ్బరి చిప్పల సేకరణలో వంద మంది
by Ajay Maddhiboyina |
మేడారం సమ్మక్క, సారలక్కల గద్దెల దగ్గర భక్తుల తాకిడి గంట గంటకు పెరుగుతోంది. ఈ క్రమంలో క్యూ లైన్లలో నిలుచున్న భక్తులు, మొక్కులు తీర్చుకునే భక్తులు కొబ్బరి కాయలు, బెల్లం(బంగారం) ను గద్దెల లోపలికి విసురుతున్నారు.

X
దిశ, మేడారం నెట్వర్క్: మేడారం సమ్మక్క, సారలక్కల గద్దెల దగ్గర భక్తుల తాకిడి గంట గంటకు పెరుగుతోంది. ఈ క్రమంలో క్యూ లైన్లలో నిలుచున్న భక్తులు, మొక్కులు తీర్చుకునే భక్తులు కొబ్బరి కాయలు, బెల్లం(బంగారం) ను గద్దెల లోపలికి విసురుతున్నారు. ఇలా విసిరిన కొబ్బరికాయలు, బెల్లం గంటల వ్యవధిలో గుట్టలుగా పేరుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇలా బంగారం, కొబ్బరి చిప్పలు పేరుకుపోకుండా ప్రత్యేకంగా సిబ్బంది సాయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. దాదాపు వంద మంది సిబ్బందిని దినసరి కూలీలుగా తీసుకుని కొబ్బరి చిప్పలు ఎప్పటికప్పుడు సమ్మక్క, సారక్క గద్దెల నుండి సేకరిస్తున్నారు. బస్తాల్లో నింపి ఇక్కడ నుండి మణుగూరుకు పంపిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
Next Story






