కానిస్టేబుల్ పై దాడి.. ఒకరి అరెస్ట్

by velandi.Saikiran |

కానిస్టేబుల్ పై దాడి జ‌రిగిన సంఘ‌ట‌న‌లో.. ఒకరు అరెస్ట్ అయ్యారు.

కానిస్టేబుల్ పై దాడి.. ఒకరి అరెస్ట్
X

దిశ, ఆత్మకూర్: కానిస్టేబుల్ పై దాడి జ‌రిగిన సంఘ‌ట‌న‌లో.. ఒకరు అరెస్ట్ అయ్యారు. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పాండవుల దివ్య, ఆమె మాజీ భర్త పాండవుల కిరణ్ ఇద్ద‌రు గొడ‌వ ప‌డ్డారు. ఈ క్ర‌మంలో 100 డయల్ దివ్య చేయగా పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్. ప్రవీణ్ కుమార్, జె . శ్రీనివాస్, ఇద్దరు కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో ప్రవీణ్ కుమార్ అనే కానిస్టేబుల్ పై బూతులు తిడుతూ, దాడికి పాల్ప‌డ్డాడు పాండవుల కిరణ్. దీంతో కానిస్టేబుల్ కాలుకు గాయం అయింది. దీనిపై ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఈ నేప‌థ్యంలో పాండవుల కిరణ్ పై కేసు నమోదు చేసి, పరకాల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో 14 రోజుల రిమాండ్ విధించింది మేజిస్ట్రేట్. పోలీసులపై దాడి చేస్తే, క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆత్మకూరు సిఐ ఆర్. సంతోష్ హెచ్చ‌రించారు.

Next Story