- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోటలో అధికారుల అద్దె కార్ల దందా..!
ప్రభుత్వం కార్ అలవెన్స్ (వాహాన భత్యం) కింద కలెక్టర్ నుంచి మొదలుకొని అదనపు కలెక్టర్లు, ఆర్.డీ.వో లు, తహసీల్దార్లు, ఎం.పీ.డీ.వోలు,వివిధ శాఖల అధికారులకు వాహాన అలవెన్స్ అందిస్తోంది.

ప్రభుత్వ అధికారులు కొందరూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ అలవెన్స్ దందా కు పాల్పడుతున్నారు. కొన్ని ట్రావెల్స్ యజమానులతో కుమ్మక్కై వారికి కొంత ముట్ట చెబుతా ఈ దందా కి తెర లేపుతుండగా అలవెన్స్ పొందే కార్లకి, నడిచే కార్లకి సంబంధం లేకున్న ఎస్.టి.ఓ, డి.టి.ఓ లు బిల్లులు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వైట్ ప్లేట్ నెంబర్లు గల వాహానాలు వాడుతున్నారు. దీనిపై రవాణాశాఖ అధికారుల పట్టింపు లేకపోగా.. అలవెన్స్ వ్యవహారం పై విజిలెన్స్ విభాగం కిం అనకుండా ఉన్నట్టు విమర్శన లు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, మహబూబాబాద్ : ప్రభుత్వం కార్ అలవెన్స్ (వాహాన భత్యం) కింద కలెక్టర్ నుంచి మొదలుకొని అదనపు కలెక్టర్లు, ఆర్.డీ.వో లు, తహసీల్దార్లు, ఎం.పీ.డీ.వోలు,వివిధ శాఖల అధికారులకు వాహాన అలవెన్స్ అందిస్తోంది. వారి హోదా, బాధ్యతలు తిరిగి దూరాన్ని బట్టి ప్రతి నెల 20 వేల నుంచి రూ.32 వేల వరకు అలవెన్సులు మంజూరు చేస్తుంది. కొందరికి ప్రభుత్వ వాహనాలు కేటాయించగా.. మరికొందరికి వ్యక్తిగత వాహానాల వినియోగానికి గాను నిర్దిష్ట పరిమితిలో అలవెన్స్ చెల్లిస్తున్నారు. ఇంధన వ్యయం, డ్రైవర్ జీతం,వాహాన నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చెల్లింపులు చేస్తుంది. అధికారుల అధికారిక పనుల నిమిత్తం తరచూ గ్రామాలు, మండలాలు, ప్రాజెక్టు ప్రాంతాలు సందర్శించాల్సి ఉండటంతో వాహన సౌకర్యం అవసరమనే కారణంతో ఈ భత్యాన్ని అందజేస్తున్నారు. మరి కొంతమంది అధికారులైతే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్స్ చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బినామీ ట్రావెల్స్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి..?
ప్రభుత్వం ఉన్నతాధికారులకు అధికారిక పనుల కోసం కార్ అలవెన్స్ మంజూరు చేస్తోంది. ఐతే ఈ సౌకర్యాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత వాహనాలను అద్దె వాహనాలుగా చూపిస్తూ, బినామీ ట్రావెల్స్ సంస్థల పేర్లతో బిల్లులు సమర్పిస్తున్నారని సమాచారం.వాస్తవానికి వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తూ,అద్దె ఖర్చులుగా చూపించడం ద్వారా ప్రతి నెలా ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఎల్లో నంబర్ ప్లేట్ (టాక్స్ ప్లేట్ ) వాహనాలకే అద్దె బిల్లులు చెల్లించాలి. కానీ కొన్ని చోట్ల తెల్ల నంబర్ ప్లేట్ల వాహనాలకే అద్దె బిల్లులు జతచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకే ట్రావెల్స్ సంస్థ పేరుతో పలువురు అధికారులు బిల్లులు క్లెయిమ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై ఆడిట్ విభాగం,రవాణా శాఖ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రవాణా శాఖ తనిఖీ లు శూన్యం.. విజిలెన్స్ అధికారుల మౌనం.!
కారు అలవెన్స్ ఉపయోగించుకుంటున్న వారు జిల్లా స్థాయి ఉన్నతాధికారులే కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి ముందుకు రావడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అద్దె వాహానాలు కమర్షియల్ రిజిస్ట్రేషన్, పసుపు నంబర్ ప్లేట్లు, చెల్లుబాటు అయ్యే పర్మిట్, టాక్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.ఐతే కొన్ని చోట్ల ఆన్ గౌట్ డ్యూటీ పేరా తెల్ల నంబర్ ప్లేట్లతోనే వాహనాలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగుతున్నాయన్న ఆరోపణలు ఉండగా ప్రభుత్వ నిధుల వినియోగంపై పర్యవేక్షణ చేయాల్సిన విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవడం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.బినామీ ట్రావెల్స్ పేరుతో బిల్లులు సమర్పించడం, ఒకే వాహనాన్ని వేర్వేరు అధికారుల పేర్లపై చూపించడం వంటి ఆరోపణలు ఉన్నప్పటికి లోతైన దర్యాప్తు జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అలాగే ఎస్.టి.ఓ,డి.టి.ఓ ల నిఘా లేకపోవడంతో అలవెన్స్ పొందే కార్లకి, ప్రస్తుతం నడుస్తున్న కార్లకి సంబంధం లేకున్నా బిల్లులు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.






