- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ పోలింగ్‌కు కసరత్తు.. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు
ఉమ్మడి వరంగల్జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. 12మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. 12మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పోలింగ్ కు అవసరమైన సిబ్బందిని ర్యాండమైజేషన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడల్ కోడ్ అమలు చేయడంతో పాటు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
11న పోలింగ్
ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో ఈ నెల 11 న పోలింగ్ జరగనుంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు, స్టేషన్ ఘన్పూర్ లో 18 వార్డులు, నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు, పరకాలలో 22 వార్డులు, డోర్నకల్ లో 15 వార్డులు, కేసముద్రంలో 16 వార్డులు, మహబూబాబాద్ లో 36 వార్డులు, మరిపెడలో 15 వార్డులు, తొర్రూర్ లో 16 వార్డులు, భూపాలపల్లిలో 30 వార్డులు, ములుగులో 20 వార్డులు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఆధారంగా ర్యాండమైజేషన్ చేసి సిబ్బందిని నియమిస్తున్నారు. వారికి పోలింగ్ పై శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రశాంతంగా ఓటింగ్ జరిగే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నియమనిబంధనలు పాటించడంతో పాటు పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తికావడంతో అధికార యంత్రాంగం మొత్తం పోలింగ్ పైనే దృష్టి పెట్టింది. ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు కావాల్సిన సిబ్బందిని ఇప్పటికే నియమించారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చేస్తున్నారు.
చెక్‌పోస్టుల ఏర్పాటు
ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తూ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మౌలిక వసతులను కల్పించడంతో పాటు మోడల్ కోడ్ అమలయ్యే విధంగా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 మున్సిపాలిటీల పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నగదు, మద్యం రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లను చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు ఎన్నికలకు సంబంధించిన బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలింగ్ రోజు భారీ ఎత్తున పోలీసులను మొహరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రచారం ముగియగానే ఉద్యోగులను పోలింగ్ కోసం తరలించేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల వలే మున్సిపల్ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.






