- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"రీ-అలైన్మెంట్" చేసుకోని కేబుల్ వైర్లు వెంటనే తొలగించాలి
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ కార్పోరేట్ కార్యాలయం, విద్యుత్ భవన్ హన్మకొండ లో నేడు సంస్థ

దిశ హన్మకొండ టౌన్ : నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ కార్పోరేట్ కార్యాలయం, విద్యుత్ భవన్ హన్మకొండ లో నేడు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల ఎస్ఇ, డిఈ ఆపరేషన్, డిఈ టెక్నికల్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నుంచి పోల్ ల పైన ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించిన పట్టించుకోవడం లేదని, విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయని ,అందుకు అనుగుణంగా కేబుల్ వైర్లు రి-అలైన్మెంట్ చేసుకోవాలని లేని యెడల తొలగించాలని 16 సర్కిళ్ల ఎస్ .ఈ లను ఆదేశించారు.
ప్రమాదకర స్థాయిలో గుత్తులు గుత్తులుగా కేబుల్ వైర్లు ఉండటం చేత ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్పీడీసీఎల్ కు మొదట ప్రజల భద్రత ముఖ్యమని పేర్కొన్నారు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలని సూచించారు . లేని యెడల తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించాలని ప్రమాద భరితంగా ఉన్న లైన్ ల క్లియరెన్స్ చేపట్టాలని అన్నారు . రోజు రోజు కు విగ్రహాల ఎత్తు పెంచి విగ్రహాల తయారు చేస్తున్నారని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎత్తు గల విగ్రహాల తరలింపు సమయంలో లైన్లకు తగలకుండా లైన్ ల డిస్ - కనేకనెక్షన్ చేయాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు . దుర్గ మాత పండుగ కూడా త్వరలో వస్తుంది కనుక జాగ్రత్త వహించాలని అన్నారు . వినాయక నిమజ్జన రూట్ లన్ని తనిఖీ చేపట్టాలని అన్నారు . రూట్ క్లియరెన్స్ ఉండేలా ఇప్పటినుండే సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు . వినాయక మండపాలు పెట్టె సభ్యులతో మాట్లాడి విద్యుత్ పట్ల జాగ్రత్త వహించాలని 16 సర్కిళ్ల ఎస్ .ఈ ల కు చెప్పారు . అందరి సమన్వయంతో ఎప్పటిక్కప్పడు జాగ్రత్తలు వివరిస్తూ పండుగలను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో 16 సర్కిళ్ల ఎస్ ఇ, డి ఇ ఆపరేషన్, డి ఇ టెక్నికల్ అధికారులు పాల్గొన్నారు.






