- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటీసులు బేఖాతరు..!
నర్సంపేట పట్టణంలో అనుమతులు లేకుండా ఇండ్లను నిర్మిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో అనుమతులు లేకుండా ఇండ్లను నిర్మిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ వాడకం మొదలు కనీస అనుమతులు సైతం లేకుండా యథేచ్చగా తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు వైపున గల జనని నర్సింగ్ హోం నిర్వహిస్తున్న భవనానికి అనుమతి ఉందా లేదా తెలపాలంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మే 27వ తేదీన డా. మోతే నవతకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు అందజేశారు. ఇందులో భూమి పేపర్లు, లింక్ డాక్యుమెంట్స్, ఈ.సీ, భవన నిర్మాణ అనుమతి కాపీని అందజేయాలని ఆదేశించారు. నోటీసు అందిన 7రోజుల లోగా అందజేయాలని, లేనిచో మున్సిపాలిటీ చట్టం 2019 నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నేటికి 18 రోజులు గడుస్తున్నా ఎలాంటి అనుమతి పత్రాలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు అందజేయలేదని తెలుస్తోంది. వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని నోటీసు అందజేసిన టౌన్ ప్లానింగ్ శాఖ నేటికీ మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వారం అనంతరం అయినా కనీసం రెండో నోటీసు సైతం అందజేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే ఉన్నపళంగా తీసేసే మున్సిపల్ అధికారులు మరికొందరి విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై పట్టణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.






