నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు..

by Taduka Kalyani |

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఛేదించారు.

నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు..
X

దిశ, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పాపిన్వర్ సునీల్ కుమార్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. విచారణలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిందితులు కలిసి నకిలీ పింక్ బాండ్ పత్తి విత్తనాలను రైతులకు విక్రయించినట్లు తేలింది. పోలీసుల దాడుల్లో 792 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, అనుమతులు లేని పురుగుమందులు, ఎక్స్‌పైర్డ్ విత్తనాలు, ప్యాకింగ్ యంత్రాలు, కారు, మొబైల్ ఫోన్లతో పాటు మొత్తం రూ.20 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని ఎస్పీ హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా అధికారిక డీలర్ల వద్ద నుంచి బిల్లుతోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విక్రయాలపై వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఐ నాగరాజు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Next Story