- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన: చీఫ్ అభిజీత్ దీప్కేపై దుండగుల అటాక్
నీట్ పేపర్ లీకేజీపై జైపూర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పరీక్షల పేపర్ లీకేజీ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijit Deepke) ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ ఆందోళనల సందర్భంగా అభిజీత్ దీప్కేపై దుండగులు మొఖంపై చంపదెబ్బలతో ఒక్కసారిగా అటాక్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించగా సీజేపీ కార్యకర్తలు పట్టుకుని తిరిగి వారికి దేహశుద్ధి చేశారు.
కాగా, గత నెలలో కూడా అభిజీత్ దీప్కేకు వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని బెదిరింపులు వచ్చిన మాట వాస్తవమే. ఆ సమయంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జైపూర్‌లో నిరసనల వేళ ఆయనకు భారీ భద్రత కల్పించనప్పటికీ దుండగులు దాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం దాడికి సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






