- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exports: మేలో భారత ఎగుమతుల జోరు
పశ్చిమాసియా దేశాల్లో వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు వాణిజ్య ప్రతినిధి బృందాలు, ఎగుమతి ప్రోత్సాహక సంస్థలు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సరుకుల ఎగుమతులు గణనీయంగా పెరగడం, అలాగే పశ్చిమాసియా మార్కెట్ల నుంచి డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో మే నెలలో భారత వస్తు ఎగుమతులు చరిత్రాత్మక స్థాయికి చేరాయి. మేలో దేశ ఎగుమతులు 45.20 బిలియన్ డాలర్లు(రూ. 4.27 లక్షల కోట్లు)గా నమోదై కొత్త రికార్డు సృష్టించాయి. పశ్చిమాసియా దేశాల్లో వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు వాణిజ్య ప్రతినిధి బృందాలు, ఎగుమతి ప్రోత్సాహక సంస్థలు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుతుండటంతో రాబోయే నెలల్లో కూడా ఎగుమతుల వృద్ధి కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ముడి చమురు దిగుమతులు పెరగడంతో దేశ వస్తు దిగుమతులు కూడా మేలో 73.40 బిలియన్ డాలర్ల(రూ. 6.94 లక్షల కోట్ల)కు చేరి ఏడు నెలల గరిష్ట స్థాయిని తాకాయి. అయితే ఎగుమతుల వృద్ధి ప్రభావంతో వాణిజ్య లోటు గత నెలతో పోలిస్తే కొంత తగ్గి 28.21 బిలియన్ డాలర్ల(రూ. 2.67 లక్షల కోట్ల) వద్ద స్థిరపడింది. తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయని, దాని ప్రభావం జూన్ ఎగుమతి గణాంకాల్లో కూడా ప్రతిబింబించవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.






