- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన నామినేషన్
సర్పంచ్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్

ముగిసిన నామినేషన్
=మొదటి విడత గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం
=అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలోకి
=దిగిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు
=భారీగా ఖర్చు చేస్తున్నపోటీలో ఉన్న అభ్యర్థులు
గె=లుపుల కోసం తీవ్ర ప్రయత్నాలు
దిశ,వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడు విడతల్లో నామినేషన్లు పూర్తి కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టారు. మొదటి విడత గ్రామాల్లో ప్రచారానికి ఇంకా మూడే రోజులు మిగిలి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వార్డు, సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ బంధువులను, అనుచరులను ప్రచారంలో దింపి ఇంటింటికి తిరుగుతూ ఓటరు మద్దతును కూడగడుతున్నారు. గెలుపు కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తూ మద్దతు కూడగడుతున్నారు.ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అభ్యర్థులు వార్డు, సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు వేశారు. మొదటి, రెండవ విడత విత్ డ్రా సమయం కూడా ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు. పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్య ర్థులతో పాటు ఇతర అభ్యర్థులు కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఇళ్లు ఇళ్లు తిరగడంతో పాటు తమను గెలిపిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లలోకి వెళుతూ అన్ని వర్గాల వారిని కలుస్తూ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
ఎన్నికల్లో భారీగానే అభ్యర్థులు ఖర్చు
సర్పంచ్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టగా తీసుకున్నాయి. ఎవరికి వారే తమ నియోజకవర్గంలో పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటరు మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు.మొదటి విడత గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, యశస్వినీరెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళినాయక్, రాంచంద్రనాయక్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపించే విధంగా గ్రామాల్లో పర్యటిస్తూ పావులు కదుపుతున్నారు. మొదటి విడత పూర్తికాగానే రెండవ విడత, మూడవ విడత గ్రామాల్లో ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.
వీరికి ధీటుగానే బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజయ్య, రెడ్యానాయక్, ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పార్టీ నేతలు నాయకులతో పాటు మాజీ ఎంపీ కవితలు ప్రచారంలో పాల్గొంటున్నారు.బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పోటీచేస్తున్న ఆ పార్టీ నేతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుపెట్టలేదు.ఈ ఎన్నికల్లో భారీగానే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. మొదట నామమాత్రం ఖర్చుతో ఎన్నికల్లో బయటపడతామనుకున్న అభ్యర్థులు నామినేషన్ ఘట్టం ముగిసిన తర్వాత పోటీ ఎక్కువగా ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంత మేర అభ్యర్థులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నా పూర్తిస్థాయిలో మాత్రం అభ్యర్థులు ఈ ఖర్చును కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఎమో కానీ కొంతమంది అభ్యర్థులు ఆస్తులు అమ్మి ఖర్చు చేస్తున్నారు.






