- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం..
జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లపై కౌన్సిలర్లు మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకరకు అవిశ్వాసం తీర్మానం నోటీసు అందజేశారు.

X
దిశ, కాటారం, (భూపాలపల్లి ): జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లపై కౌన్సిలర్లు మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకరకు అవిశ్వాసం తీర్మానం నోటీసు అందజేశారు. మున్సిపల్ లలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్దు , వైస్ చైర్మన్ కొత్త హరిబాబులపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో బీఆర్ఎస్ లో అసమ్మతి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటినా నిధుల మంజూరు, ప్రొటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కాగా నోటీసు అదనపు కలెక్టర్ కు ఇచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాల్ పల్లిలోనే ఉన్నారు.
Next Story






