గీసుకొండ మండలంలో ఇండియన్ గ్యాస్ డీలర్ నిర్వాకం

by Ratna Kumari |

గీసుకొండ మండలంలోని కొనయమాకులలో ఇండియన్ గ్యాస్ డీలర్ మేకల ఎశోభ్ నిర్లక్ష్య వైఖరిపై వినియోగదారులు మండిపడుతున్నారు.

గీసుకొండ మండలంలో ఇండియన్ గ్యాస్ డీలర్ నిర్వాకం
X

దిశ, గీసుకొండ : గీసుకొండ మండలంలోని కొనయమాకులలో ఇండియన్ గ్యాస్ డీలర్ మేకల ఎశోభ్ నిర్లక్ష్య వైఖరిపై వినియోగదారులు మండిపడుతున్నారు. దొంగ చాటుగా గ్యాస్ సిలిండర్లు తరలిస్తూ బుక్ చేసుకున్న వారిని గోస పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

బుక్ చేసుకుంటే గ్యాస్ రాదు

కొనయమాకుల పరిసర గ్రామాల ప్రజలు సిలిండర్ బుక్ చేసుకున్నా వారాల తరబడి సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ వద్దకు వెళ్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు.

బ్లాక్‌లో అమ్మకాలు..?

ఇటు అధికారికంగా సిలిండర్లు లేవంటూనే అటు దొంగ చాటుగా అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

డీలర్‌షిప్ రద్దు చేయాలని వినియోగదారుల డిమాండ్

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మేకల ఎశోభ్ డీలర్‌షిప్‌ను వెంటనే రద్దు చేయాలని గీసుకొండ మండల వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరపాలని కోరుతున్నారు.

Next Story