- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసముద్రం మండలంలో గంజాయి నిర్మూలనకు నైట్ బైక్ పెట్రోలింగ్
గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు ప్రత్యేక నైట్ బైక్ పెట్రోలింగ్ నిర్వహించారు.

దిశ, కేసముద్రం : గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు ప్రత్యేక నైట్ బైక్ పెట్రోలింగ్ నిర్వహించారు. కేసముద్రం సర్కిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పెట్రోలింగ్ చేపట్టారు. గంజాయి సేవించే అవకాశమున్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని గంజాయి టెస్ట్ కిట్‌తో పరీక్షలు చేయగా ఫలితాలు నెగటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు పోలీసులు సూచిస్తూ రాత్రి 10 గంటల తరువాత అత్యవసర అవసరాలు లేకుండా బయట తిరగవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్ సూచించారు.






