- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మరిపెడలో అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన
- పీఏసీఎస్ సొసైటీ, మోడల్ స్కూల్, మునిసిపాలిటీ కార్యాలయం పరిశీలన
దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం మరిపెడ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మరిపెడ రోడ్ లోని పీఏసీఎస్ సొసైటీ గోదాంను పరిశీలించారు. యూరియా స్టాక్, సరఫరా తాలుకు రిస్టార్లు తనిఖీ చేశారు. యూరియ పంపిణీ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మునిసిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టార్ పరిశీలించారు. వీఆర్వోలు తిరిగి వెళ్లాకా మునిసిపల్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోడల్ స్కూల్ సందర్శించి విద్యార్థుల తరగతి గదులు, పరిసరాలు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి విద్య ప్రమాణాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ నందు టాయిలెట్స్, గ్రౌండ్, సోలార్ సిస్టం ఏర్పాటు చేయాల్సిందిగా విద్యార్థులు అదనపు కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మెన్ చాపల యాదగిరి రెడ్డి, ఏడీఏ విజయ్ చంద్ర, ఏవో వీరాసింగ్, తహసీల్దార్ కృష్ణ వేణి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ విజయానంద్, ఎస్ఐ సతీష్, ఆర్ఐ శరత్ చంద్ర, వార్డు ఆఫీసర్ ఏకలవ్య ఉన్నారు.






