- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సంపేటలో నూతన మద్యం దుకాణాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో 57 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

నర్సంపేటలో నూతన మద్యం దుకాణాలివే..
దిశ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో 57 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. వరంగల్ జిల్లాలో మద్యం దుకాణాల స్లాబులు రూ. 50 లక్షలకు 7, రూ.55 లక్షలకు 32, రూ. 60 లక్షలకు 12, రూ. 85 లక్షలకు 6 కేటాయించారు. జిల్లాలో కేటగిరీల వారీగా గౌడ కులస్తులకు14, ఎస్సీలకు 6, ఎస్టీ లకు 2 కేటాయించారు. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాల వివరాలు.. గెజిట్ నంబర్ 2, 8 నర్సంపేట, 16 ఖానాపురం, 19 ఉప్పరపల్లి, ఎస్సీలకు కేటాయించిన దుకాణాలు.. గెజిట్ నంబర్ 9 నర్సంపేట, 10 నల్లబెల్లి, 15 నెక్కొండ, 17 పాకాల అశోక్ నగర్. ఎస్టీలకు గెజిట్ నంబర్ 22 గిర్నిబావి/దుగ్గొండి. కావలసిన అర్హతలను అనుసరించి నేటి నుండి వచ్చే నెల 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.






