- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నెల్లికుదురు: వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలకు గురై పులసాని విష్ణువర్ధన్(40) ఉప్పర బోయినపరుశరాములు(59)మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోచోటుచేసుకుంది.ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన పులసాని విష్ణువర్ధన్ పార్వతమ్మ గూడెం నుంచి బైక్ పై తన సొంత ఊరు కాంపల్లికి వెళ్తున్న క్రమంలో కాస్య తండా సమీపంలో రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రి మానుకోటలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతిని తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మండలంలోని మునిగల వీడు కు చెందిన ఉప్పర బోయిన పరుశరాములు ఏప్రిల్ 25న తన ఎక్సెల్ బైక్ పై ఐకెపి సెంటర్ కు వెళ్తుండగా శ్రీరామ గిరికి చెందిన మందుల వెంకన్న రాంగ్ రూట్లో షైన్ బైక్ పై వస్తూ ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న కన్నుమూశాడు.మృతిని బంధువు ఈద వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐ ఆర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.






