- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌ను ఢీకొన్న కారు.. గాయాల నుంచి కోలుకోలేక వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మానుకోట జిల్లాలోని నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, నెల్లికుదురు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మానుకోట జిల్లాలోని నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నర్సింహుల గూడెంకు చెందిన అంబటి మహేష్ (39) తన వ్యక్తిగత పనులపై బైక్‌పై తొర్రూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, మునిగల వీడు సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.
వెంటనే స్థానికంగా మానుకోటలోని ఓ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం, అనంతరం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స పొందిన ఆరోగ్యం మెరుగుపడక శనివారం మహేష్ మృతి చెందాడు. ఈ సంఘటనపై మహేష్ సోదరుడు అంబటి ఉమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు.
Next Story






